Kantara Chapter 1

Kantara Chapter 1: చరిత్ర సృష్టించిన కాంతార చాప్టర్ 1!

Kantara Chapter 1: రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార: చాప్టర్ 1’ బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది. తొలి వారంలోనే రూ.450 కోట్లకు పైగా వసూలు చేసింది. అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 2025లో అత్యధిక వసూళ్ల సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా మరో ట్రెండ్ సెట్ చేస్తుంది.

Also Read: Nagarjuna: నాగార్జున 100వ చిత్రంలో టబూ హీరోయిన్?

రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా రిలీజైన మొదటి రోజు నుంచి సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.457.7 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో రూ.126.4 కోట్లు, ఆంధ్రప్రదేశ్-తెలంగాణలో రూ.74 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.122.4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.70 కోట్లు సాధించింది. కేరళ, తమిళనాడులోనూ భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కథ, దర్శకత్వం, నటన ప్రతి అంశంలోనూ ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. ఇతర పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం థియేటర్లలో దూసుకుపోతోంది. 2025లో తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం సినిమాకు బలంగా నిలిచాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నమోదు చేస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *