Vijay vs Rishab: రిషబ్ శెట్టి నటించిన ‘కాంతారా’ చిత్రం అనూహ్యమైన విజయాన్ని సాదించిన సంగతి తెలిసిందే. రిషబ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాను కన్నడ నిర్మాణ సంస్థ హోంబళే ఫిలిమ్స్ నిర్మించింది. కన్నడలో రిలీజ్ అయి హిట్ అయిన ఈ సినిమా ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం రిషబ్ ఈ సినిమాకు ప్రీక్వెల్ తీస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కూడా వచ్చే ఏడాది అదే డేట్ కి రాబోతున్నట్లు వినిపిస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హేగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. తమిళనాడు సాధారణ ఎన్నికలకు ముందు ఈ సినిమాను రిలీజ్ చేసి బెనిఫిట్ పొందాలని విజయ్ భావిస్తున్నాడు. ఇటీవల తన రాజకీయ పార్టీ బహిరంగ సభ విజయవంతం కావటంతో విజయ్ కూడా ఖుషీగా ఉన్నాడు. మరి విజయ్ తో ఢీ కొనబోతున్న రిషబ్ ఎలాంటి పోటీ ఇస్తాడు? వారిద్దరిలో ఆడియన్స్ మెప్పును ఎవరు పొందుతారన్నది తెలియాలంటే వచ్చే ఏడాది అక్టోబర్ 2 వరకూ ఆగక తప్పదు.

