Rice Price: భారతదేశంలో పండే బియ్యానికి ధర ఎంత ఉండొచ్చనుకుంటారు. కిలో ఒక్కంటికి రూ.40 నుంచి మహా అయితే రూ.150 వరకూ ఉండొచ్చు. బాస్మతి రైస్‌కు ఇంకొంత అధికంగా ఉండొచ్చు. అంతే కానీ వేలల్లో అయితే ఉండదు. ఇదే ధరలు ఇతర దేశాల్లో కూడా కాస్తా అటూ ఇటుగా ఉండొచ్చు. కానీ, వేలల్లో బియ్యం ధర ఉంటుందంటే నమ్ముతారా? అవునండి.. ఒకటి, రెండు వేలు కాదు.. కిలో ఒక్కంటికి ఏకంగా రూ.15 వేలు ధర పలుకుతుందంటే అతిశయోక్తి కదా.
Rice Price: ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఆహార ఉత్పత్తులను పండిస్తారు. కొన్ని దేశాల్లో వరి, మరికొన్ని దేశాల్లో గోదుములలు, ఇంకొన్ని దేశాల్లో బార్లీ, చిరుధాన్యాలు ఇలా ఆహార ఉత్పత్తులను పండిస్తారు. వాటి ధరలు కూడా ఒక్కో రకంగా ఉంటాయి. వాటిలో ఉండే బలవర్థకమైన పదార్థాలు కూడా ఒక్కో తీరుగా ఉంటాయి. అయితే ప్రపంచంలో అత్యధిక ధర కలిగిన బియ్యం మాత్రం జపాన్ దేశంలో పండిస్తారు. ఆ బియ్యానికి ధర ఎంతో తెలుసా? కిలో ఒక్కంటికి అక్షరాలా రూ.15,000 పలుకుతుంది.
Rice Price: అత్యధిక ధర పలికే ఈ బియ్యం రకం పేరు కిన్మెమెయ్. ఈ రకాన్ని కిలో రూ.12,000 నుంచి రూ.15,000 వరకు విక్రయిస్తారు. అందులోని పోషక విలువు, నాణ్యత, మృదుత్వం, రుచికి మరే బియ్యం సాటి రావని అక్కడి రైతులు చెప్తారు. రిన్స్ ఫ్రీ రైస్‌గా పిలిచి ఈ బియ్యాన్ని కడగకుండానే నేరుగా వండుకోవచ్చట. ప్రస్తుతం టోయో అనే సంస్థ ఈ బియ్యంపై పేటెంట్ తీసుకొని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నది. మరి మన బియ్యానికి అంత ధర రావాలంటే ఏం చేయాలి. లేదా అలాంటి వంగడాలు మన దేశానికి వస్తాయా? భవిష్యత్తులో వస్తుందని ఆశిద్దాం.