RGV: రామ్ చరణ్ హీరోగా, సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పెద్ది” ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ ఫస్ట్ షాట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండగా, వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) స్పందన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “పెద్ది” గ్లింప్స్ చూసిన ఆర్జీవీ.. “ఇది నిజమైన గేమ్ ఛేంజర్! రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కాదు.. యూనివర్సల్ లెవెల్‌కి చేరాడు” అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా, “రాజమౌళి తర్వాత రామ్ చరణ్‌లోని టాలెంట్‌ని గుర్తించిన దర్శకుడు బుచ్చిబాబు ఒక్కడే. ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసే ట్రిపుల్ హిట్ అవుతుంది” అని జోష్‌గా చెప్పుకొచ్చారు. ఆర్జీవీ కామెంట్స్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఆకాశాన్ని తాకుతోంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్.. రామ్ చరణ్‌ని మరోసారి బాక్సాఫీస్ కింగ్‌గా నిలబెట్టే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ హైప్‌తో “పెద్ది” రిలీజ్ కోసం అభిమానులు రోజులు లెక్కపెడుతున్నారు. మరి, ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!
