RGV: మెగా హీరో పై ఆర్జీవి వైరల్ కామెంట్..

RGV: రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాకి చెందిన తొలి సాంగ్ ‘చికిరి చికిరి’ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఈ పాటతో చరణ్‌ మాస్ ఎనర్జీ, రా అటిట్యూడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సినిమా డైరెక్టర్ బుచ్చి బాబు సానాకు సినీ ప్రేమికులు, ఇండస్ట్రీ వర్గాలు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు. “డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ – ఏదైనా క్రాఫ్ట్ ఉన్నా హీరోని ఎలివేట్ చేయడమే ముఖ్యమని ఈ పాట నిరూపించింది. ‘చికిరి చికిరి’లో రామ్ చరణ్ చాలా రా, రియల్, ఎక్స్‌ప్లోసివ్‌గా కనిపించారు. ఎలాంటి అనవసర మెరుపులు, భారీ సెట్స్, వందల మంది డ్యాన్సర్లు లేకుండా కూడా స్టార్ పవర్‌ను మెరిపించడం బుచ్చి బాబు సానా టాలెంట్‌కి నిదర్శనం. స్టార్‌పై ఫోకస్ ఉంచడంలో అద్భుతంగా సక్సెస్ అయ్యావు,” అని రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు.

ఈ పాటలో చరణ్ చేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్, ఇన్‌ఫ్లూయెన్సర్లు రీల్స్, షార్ట్ వీడియోల రూపంలో ఆ స్టెప్‌ను రీక్రియేట్ చేస్తూ సోషల్ మీడియా అంతా ఫుల్ ఎనర్జీతో నిండిపోయింది.

‘పెద్ది’ సినిమా మార్చి 27, 2026న థియేటర్లలో విడుదల కానుంది. రామ్ చరణ్ – జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం ఫన్, ఎమోషన్, యాక్షన్ మేళవింపుతో ప్రేక్షకులకు మాస్ ఎంటర్టైన్‌మెంట్ అందించబోతుందని టాక్.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *