Reverse Zoo: ఒక అడవిలో పెద్ద బోను పెట్టి అందులో మిమ్మల్ని బంధించి.. వదిలేస్తే.. ఏం జరుగుతుంది. తెలుసుకోవాలని ఉంటే చైనా వెళ్ళాలి. సాధారణంగా మనం జంతువులను చూడాలంటే జూకి వెళతాం. అక్కడ బోనుల్లో ఉన్న పులులు.. సింహాలను చూసి మురిసిపోతాం. దానికి వ్యతిరేకంగా మనల్ని బోనులో పెట్టి జంతువులను స్వేఛ్చగా వదిలేస్తే ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలియాలంటే చైనా వెళ్ళాలి. ఎందుకంటే, అక్కడ ఇలాంటి జూ ఉంది. దీనిని రివర్స్ జూ అంటారు. అంతేకదా మరి.
Reverse Zoo: అక్కడ అడవిలోకి తీసుకువెళ్లి మనల్ని బోనులో బంధిస్తారు. అక్కడ ఉన్న పులులు, సింహాలు సరదాగా వచ్చి మనల్ని చూసి పలకరిస్తాయి. బోను మీద దాడి చేస్తాయి. బోను పైకి ఎక్కి ఎగురుతాయి. అంటే మనకి జంతువులకు మధ్య ఒక కటకటాల మెష్ అడ్డుంటుంది అంతే. ఆ మెష్ కి అవతల స్వేచ్ఛగా ఉన్న మృగాలు.. ఇటుపక్క మనం ఉంటాం. గుండె ధైర్యం ఉంటేనే ఈ రివర్స్ జూలోకి వెళ్ళగలం. కాస్త వీక్ హార్ట్ అయితే, పై ప్రాణాలు పైనే పోతాయి. అంతే.
ఈ రివర్స్ జూ లకు డిమాండ్ చాలా ఉందట చైనాలో. గుంపులు గుంపులుగా మనుషులు మెష్ బోనులో ఉండి వచ్చిపోయే జంతువులు చేసే అల్లరి చూసి ఆహ్లాదంగా.. టెన్షన్ గా కొద్దిసేపు గడిపి సంబరపడిపోతున్నారట.