Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చిత్రసీమను ఏదో రకంగా ఇబ్బంది పెట్టే పనిలో పడింది.కేటీఆర్ నుండి… పరిశ్రమను తనవైపు తిప్పుకోవాలని రేవంత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తన మంత్రులతో కేటీఆర్ కు హీరోయిన్స్ తో ఉన్న అక్రమ సంబంధాల గురించి మాట్లాడించారు. డ్రగ్స్ వాడేవాడిగా కేటీఆర్ ను చిత్రీకరించారు. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా కేటీఆర్ అన్నట్టు మాట్లాడారు. అలాంటి రేవంత్… సినిమా రంగాన్ని నయానో భయానో తన వైపుకు టర్న్ చేసుకోవాలనుకున్నారు.అయితే… హైడ్రా విషయంలో నాగార్జునతో ప్రవర్తించిన తీరుపై పెదవి విప్పలేని సినిమా వాళ్ళు… ఆ తర్వాత నాగార్జున – సమంత ఇష్యూలో ఒక్కసారిగా సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.ఇప్పుడు రెండోసారి సినిమా రంగం అంతా ఏకత్రాటిపైకి వచ్చిన రేవంత్ ను విమర్శించడం మొదలెట్టింది. అరెస్ట్ చేయాల్సిన వారు ఇంకా చాలామంది ఉండగా… వారికంటే ముందే ఎ-11గా ఉన్న బన్నీని అరెస్ట్ చేయడాన్ని వాళ్ళు తప్పుపట్టారు.ఇవాళ ఉదయం కూడా సినిమా రంగానికి చెందిన వాళ్ళంతా అల్లు అర్జున్ ఇంటికెళ్ళి పరామర్శించడం జరిగింది. రేవంత్ కు ఇది ఈ మధ్య కాలంలో జరిగిన మరో దెబ్బగా భావించాలి. ఇలాంటి తప్పటడుగులే మళ్ళీ మళ్ళీ వేస్తే… సినిమా రంగం నిదానంగా రేవంత్ ను దూరం పెట్టేస్తుంది. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలోనే ఇక మీదట కలిసిమెలిసి మెలిగే ఆస్కారం ఉంటుంది. ఇదే కొనసాగితే… విశాఖలో సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేస్తామనే నినాదం చాపకింద నీరులా పాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
