KondaReddy Pally: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈనెల 12వ తేదీన దసరా పండుగ సందర్భంగా కొండారెడ్డిపల్లి గ్రామానికి రానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గ్రామంలో పర్యటించున్న సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తూ 45 లక్షలతో పశువైద్యశాల ,60 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, 50 లక్షలతో బీసీ సంక్షేమ భవనం, 50 లక్షలతో అమర్ జవాన్ యాదయ్య స్మారక గ్రంథాలయం భవనం ఇలా 3 కోట్ల రూపాయలతో పనులు పూర్తయ్యాయి. దాదాపు మరో 18 కోట్లతో చేపట్టిన శ్రీశైలం హైవే నుండి కొండారెడ్డిపల్లి గ్రామ శివారు వరకు నాలుగు లైన్ల రహదారి పనులు నిర్మాణ దశలో ఉన్నాయి.
90 లక్షల రూపాయలతో పాలశీతకరణ కేంద్రం మరియు 10 కోట్ల తో నిర్మించే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. అదేవిధంగా కొండారెడ్డిపల్లి గ్రామంలో సోలార్ వెలుగులు నింపేందుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అందులో భాగంగా రైతులకు సోలార్ పంపుసెట్లను ఉచితంగా అందించనున్నారు. దీనికి సంబంధించిన సర్వే పనులు పూర్తయ్యాయి .మరో 15 కోట్లతో గ్రామాన్ని సోలార్ విద్యుత్ గ్రామంగా తీర్చారిస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తమ గ్రామానికి నిధులు వరద పారి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు