Medaaram Maha Jatara

Medaram Maha Jatara: మేడారం మ‌హాజాత‌ర‌కు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

Medaram Maha Jatara: ప్ర‌పంచ ప్ర‌సిద్ధి పొందిన గిరిజ‌న మ‌హాజాత‌రకు వేళ‌యింది. తెలంగాణ‌లో అత్య‌ధిక గిరిజ‌న భ‌క్తులు పాల్గొనే మేడారం శ్రీ స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ మ‌హాజాత‌ర గుర్తింపు పొందింది. ఈ సారి తెలంగాణ ప్ర‌భుత్వం ఆల‌యానికి నూత‌న శోభ‌ను తీసుకొచ్చింది. వంద‌లాది కోట్ల‌తో అత్యాధునిక హంగుల‌ను తీసుకొచ్చింది. భ‌క్తుల సౌక‌ర్యార్థం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్న‌ది. 2026 జ‌న‌వ‌రి 28 నుంచి ప్రారంభం కానున్న ఈ మ‌హాజాత‌రకు హాజ‌రు కావాల్సిందిగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి ప్ర‌త్యేక ఆహ్వానం అందింది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులకు సర్‌ప్రైజ్ అప్‌డేట్!

రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ‌, ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్‌తో క‌లిసి మేడారం ఆల‌య పూజారులు అసెంబ్లీ చాంబ‌ర్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని క‌లిసి మ‌హాజాత‌ర ప్ర‌త్యేక ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేశారు. ఇదే స‌మ‌యంలో మేడారం స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ మ‌హాజాత‌రకు సంబంధించిన అధికారిక పోస్ట‌ర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్క‌రించారు. ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌చ్చే ఈ మ‌హాజాత‌ర‌ను రాష్ట్ర‌ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *