Revanth Reddy: ప్రముఖ కవి, గీత రచయిత అందెశ్రీ అంత్యక్రియల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. అందెశ్రీ పాటలు, మాటలు ప్రజా జీవితం నుంచి పుట్టుకొచ్చాయని, ప్రతి పాట తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని సీఎం కొనియాడారు. ఈ సందర్భంగా ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. దివంగత కవి చేసిన సేవలకు గుర్తింపుగా, ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే, అందెశ్రీ గారి రచనలకు సంబంధించిన ‘నిప్పులవాగు’ పుస్తకాన్ని రాష్ట్రంలోని ప్రతి గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతామని, మరియు ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని కూడా రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

