Retro: సూర్య-కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో రూపొందుతున్న ‘రెట్రో’ సినిమాపై అంచనాలు ఆకాశమే సరిహద్దుగా సాగుతున్నాయి. మే 1న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ అభిమానుల్లో ఉత్కంఠను రెట్టింపు చేశాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18 సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ జరగనుంది.
Also Read: Yamadonga: యమ దొంగ రీ-రిలీజ్‌తో జక్కన్న-తారక్ మ్యాజిక్ మళ్లీ సందడి!
Retro: సూర్య స్టైలిష్ లుక్‌తో ఫ్యాన్స్‌ను అలరించనున్నారని అంటున్నారు. మొదట గ్యాంగ్‌స్టర్ డ్రామాగా భావించిన ‘రెట్రో’.. యాక్షన్, రొమాన్స్‌తో కూడిన లవ్ స్టోరీ అని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ వెల్లడించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం చిత్రానికి మరో హైలైట్‌గా నిలవనుంది. సూర్య, జ్యోతిక సంయుక్తంగా 2D ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. ట్రైలర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందనేది ఆసక్తికరం. సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
రెట్రో – టీజర్ చూడండి :