కాప్రా లోని సాకేత్ రోడ్డులో ఉన్న ఎస్బీఐ దగ్గర రిపబ్లిక్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగం కిరణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కన్వీనర్ మేదరి రామలింగం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ హాజరైన పిల్లలు , స్థానికులకు రిపబ్లిక్ డే విశిష్టతను తెలియపరుస్తూ . . భారత రాజ్యాంగం పట్ల పౌరులు ఎలాంటి గౌరవాన్ని చూపించాలో నాయకులు వివరించారు . కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కోలా విజేందర్ పటేల్ , ఎస్బిఐ బ్యాంకు సాకేత్ రోడ్డు బ్యాంకు మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
