Renu Desai

Renu Desai: ‘అకిరా’ హీరో కావాలని రోజు కొబ్బరికాయ కొడుతున్న

Renu Desai: మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసుడు అకీరా నందన్ సినీ ఎంట్రీ ఎపుడెపుడు అంటూ తెలుగు ప్రేక్షకులు ఇంకా మెగా ఫాన్స్  వేయి కళ్ళతో ఎదురుచూస్తునారు. గత కొన్నాళ్లుగా అకీరా ఎంట్రీపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే, ఈ మెగా వారసుడి సినీ ఎంట్రీ పై తాజాగా తల్లి రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. అకీరా హీరో కావాలనే విషయంలో అభిములకంటే ఎక్కువగా తాను త్వరగా ఎంట్రీ ఇవ్వాలని నేనే కోరుకుంటున్న.  

ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ తన తనయుడి సినీ కెరీర్‌పై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అకీరా ఎప్పుడు హీరో అవుతాడని ప్రతి ఇంటర్వ్యూలోనూ తనను అడుగుతున్నారని, నిజానికి వాడి కంటే ఎక్కువగా తాను కూడా ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నానని ఆమె తెలిపారు. అకీరా త్వరగా హీరో కావాలని తాను ప్రతిరోజూ దేవుడికి కొబ్బరికాయ కూడా కొడుతున్నానని, కన్నతల్లిగా వాడు వెండితెరపై మెరవాలన్నది తన పెద్ద కోరిక అని ఆమె వెల్లడించారు.

అకీరా మౌనం.. రేణూ భయం!

అయితే, అకీరాకు నటన కంటే సంగీతంపైనే మక్కువ ఎక్కువన్న విషయం తెలిసిందే. వాడు హీరో అవుతాడా లేదా అన్న సందేహాలపై స్పందిస్తూ.. “అకీరా హీరో అవ్వాలా వద్దా అనేది పూర్తిగా వాడి ఇష్టం” అని రేణూ తేల్చి చెప్పారు. ఈ విషయం గురించి మరీ ఎక్కువగా మాట్లాడితే అకీరా తనపై అలుగుతాడని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. “మమ్మీ నా గురించి ఇలా ఎందుకు మాట్లాడావు?” అని అడుగుతాడని, అందుకే వాడి వ్యక్తిగత నిర్ణయాలను తానే ఇప్పుడే బయటపెట్టలేనని నవ్వుతూ చెప్పారు.

క్యూలో దిగ్గజ నిర్మాతలు.. పాన్ వరల్డ్ ప్లాన్!

అకీరా గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు, టాలీవుడ్‌లో భారీ ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వప్రసాద్ వంటి నిర్మాతలు అకీరాతో ‘పాన్ వరల్డ్’ సినిమా చేసేందుకు తాము సిద్ధమని బహిరంగంగానే ప్రకటించారు. అకీరా ఫిజిక్, లుక్స్ మరియు కరాటే వంటి విద్యల్లో అతడికి ఉన్న ప్రవేశం చూస్తుంటే, ఒక పక్కా మాస్ యాక్షన్ ఎంట్రీ ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతానికి అకీరా తన సంగీత సాధనలో బిజీగా ఉన్నప్పటికీ, తల్లి రేణూ దేశాయ్ కోరిక మరియు అభిమానుల ఒత్తిడి మేరకు ఈ మెగా వారసుడు మెగా ఫోన్ పట్టుకుంటాడో లేక మేకప్ వేసుకుంటాడో వేచి చూడాలి. అలాగే, తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి స్పందిస్తూ.. మంచి పాత్రలు వస్తే నటిగా కొనసాగడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *