Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో కీలక ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీకి లభించిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను హైకోర్టులో మళ్లీ విచారణ చేయాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది. అరెస్టు నుంచి రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Ranbir Kapoor: షాకిస్తున్న రణబీర్ కపూర్ సంపాదన!

ఏపీ ప్రభుత్వ వాదనలు

ఈ విచారణలో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసే సమయంలో హైకోర్టు తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు

ఈ వాదనల అనంతరం సుప్రీంకోర్టు కేసును తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పంపింది. హైకోర్టు మరోసారి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అప్పటి వరకు వల్లభనేని వంశీకి లభించిన అరెస్టు రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *