Reem Shaikh: బాలీవుడ్, టెలివిజన్ రంగంలో గుర్తింపు పొందిన నటి రీమ్ షేక్, తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. ఆమె నటనా ప్రతిభకు మెచ్చుకోలు ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో తక్కువ ఫాలోవర్స్ ఉండటం వల్ల ఆమె ఒక వెబ్ సిరీస్‌లో అవకాశం కోల్పోయినట్లు వెల్లడించారు. రీమ్, భారతి సింగ్, హర్ష్ లింబాచియా పాడ్‌కాస్ట్‌లో ఈ విషయం వెల్లడించారు.
Also Read: OTT: ఓటిటిలో సంచలన రికార్డ్ నమోదు చేసిన మలయాళం సినిమా!
Reem Shaikh: “నీ నటన బాగుంది, కానీ ఫాలోవర్స్ తక్కువగా ఉన్నారు” అని చెప్పి, ఆమె స్థానంలో మరో నటిని ఎంపిక చేశారని రీమ్ తెలిపారు. ఈ ఘటన ఇండస్ట్రీలో సోషల్ మీడియా ప్రభావాన్ని, నటన కంటే ఫాలోవర్స్ సంఖ్యకు ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తోంది. టెలివిజన్ నుంచి వెబ్ సిరీస్, బాలీవుడ్‌కు మారే ప్రయత్నంలో ఉన్న రీమ్, ఈ సవాళ్లను అధిగమించి ముందుకు సాగుతున్నారు.

