Reba Monica John: తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించిన రెబా మోనికా జాన్… గత యేడాది ‘సామజవర గమన’ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో చక్కని విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత మరే తెలుగు సినిమాకు ఆమె సైన్ చేయలేదు. అయితే ఇప్పుడో తెలుగు సినిమాలో రెబా మోనికా జాన్ నటిస్తున్నట్టు సమాచారం. అయితే ఇందులో మాత్రం ఆమె హీరోయిన్ కాదట. ఐటమ్ సాంగ్ చేస్తోందట. నార్నే నితిన్ హీరోగా నటించిన ‘మ్యాడ్’ మూవీకి సీక్వెల్ గా ‘మ్యాడ్ మ్యాక్స్’ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రెబా మోనికా జాన్ ఐటమ్ సాంగ్ చేస్తోందట. మరి ఈ సినిమా తర్వాత అయినా అమ్మడు తెలుగు సినిమాలకు ప్రాధాన్యమిస్తుందేమో చూడాలి.

