Tollywood

Tollywood: రీ-ఎంట్రీ రచ్చ: కమ్‌బ్యాక్‌లో తేలిపోయిన సీనియర్ నటీమణులు!

Tollywood: టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇవ్వాలని చూసిన ముగ్గురు హీరోయిన్ల కథ ఇప్పుడు ఒకటిగా మారింది. అన్షు, లయ, జెనీలియా.. ముగ్గురూ గతంలో హిట్ సినిమాలతో మెప్పించిన స్టార్ నటీమణులు. అయితే అన్షు ‘మజాకా’ సినిమాతో తిరిగి వచ్చింది, కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘోరంగా విఫలమైంది. ఇక నితిన్ సరసన ‘తమ్ముడు’ సినిమాతో లయ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే, ఈ చిత్రం కూడా డిజాస్టర్‌గా మిగిలింది. మరోవైపు, జెనీలియా ‘జూనియర్’ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టింది, కానీ ఆమె ఆశించిన గుర్తింపు రాలేదు. ముగ్గురూ భారీ అంచనాలతో వచ్చినా, బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిలింది. ఈ హీరోయిన్ల కెరీర్‌లో ఇది పెద్ద ఎదురుదెబ్బ. మున్ముందు వారు మరిన్ని అవకాశాలతో తమ సత్తా చాటుతారా? లేక ఈ ఫ్లాప్‌లు వారి కెరీర్‌పై ప్రభావం చూపుతాయా? వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *