RCB

RCB: ఆర్సీబీకి గాయాల బెడద..! వారూ ఫామ్ లో లేకపాయే…

RCB: మరో మూడు రోజుల్లో మహిళల ప్రీమియర్ లీగ్, ఫిబ్రవరి 14 నుంచి ఈ సీజన్ మొదలు కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – గుజరాత్ టైటాన్స్ తో ఓపెనింగ్ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ సారి ఆర్సీబీలో కొంతమంది స్టార్ ప్లేయర్లు గాయాలతో బాధపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మహిళల ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ ను సంచలనంగా గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో సోఫీ డివైన్, కేట్ క్రాస్, సోఫీ మొలిను ఈ సీజన్ కు అందుబాటులో లేరు. వీరందరూ తమ అత్యుత్తమ ఆట తీరుతో మ్యాచ్ గతిని మార్చే ప్లేయర్లు కావడం గమనార్హం.

ఈ సంవత్సరం ఆర్సీబీ తరఫున డబ్ల్యూపీఎల్ లో ఆడాల్సిన సోఫీ డిఫైన్ వ్యక్తిగత కారణాలతో ఆటకు విరామం తీసుకుంది. సోఫీ మోలినెక్స్ గాయం కారణంగా అందుబాటులో లేదు, కేట్ క్రాస్ కూడా గాయం కారణంగా తప్పుకుంది. యాషెస్ సిరీస్‌లో గాయపడి కోలుకున్న ఎల్లిసె పెర్రీ జట్టుకు తిరిగి చేరినప్పటికీ, ఆమె పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. దీనితో మోలినెక్స్ స్థానంలో చార్లీ డీన్ (ఇంగ్లాండ్), డివైన్, క్రాస్ స్థానంలో హీథర్ గ్రహమ్, కిమ్ గర్త్ ను తీసుకొచ్చారు.

Also Read: IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్, కొత్త నియమాలు పై అప్డేట్..!

గాయపడిన ప్లేయర్ల స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆర్సీబీ ప్రయత్నిస్తున్నప్పటికీ, కొంతమంది ప్లేయర్లు ఫామ్‌ కోల్పోవడం కలవరపెడుతోంది. ఆ లిస్టులో ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్ కు చెందిన ప్లేయర్ లో ఉన్నారు. ముఖ్యంగా ఎల్లిసె పెర్రీ, గత సీజన్‌లో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్, ప్రస్తుతం ఫామ్‌ కోల్పోయింది. యాషెస్ సిరీస్‌లో మూడు వన్డేల్లో 76 పరుగులే చేసింది, అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. మూడు టీ20ల్లో 21 పరుగులు, ఒక టెస్ట్‌లో రెండు పరుగులే సాధించింది. ఆమె పూర్తి ఫిట్‌నెస్ సాధించి డబ్ల్యూపీఎల్‌లో ఎలా ప్రదర్శిస్తుందో చూడాలి.

2024 సీజన్‌లో సబ్బినేని మేఘన 28 ఏళ్ల వయసులో ఆరు ఇన్నింగ్స్‌లో 168 పరుగులు చేసింది, అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. అయితే 2022 తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడని ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఇటీవల ఫామ్‌ కోల్పోయింది. సీనియర్ వుమెన్స్ టీ20 ట్రోఫీలో 11.29 యావరేజ్‌తో 79 పరుగులు చేసింది, అందులో 25 అత్యధిక స్కోర్. వన్డే ట్రోఫీలో 23.83 యావరేజ్‌తో 143 పరుగులు చేసింది, అందులో 41 అత్యధిక స్కోరు.

ALSO READ  Shafali Verma: షఫాలీ వర్మ పై వేటు వేసిన బోర్డు!

ఇంగ్లాండ్ బ్యాటర్ డాని వ్యాట్ హోడ్జే ఈ సీజన్‌లో డబ్ల్యూపీఎల్‌లో ఆరంగేట్రం చేయనుంది. యాషెస్ సిరీస్‌లో ఆమె పరుగులు చేయడంలో కష్టపడింది, మూడు వన్డేల్లో 73 పరుగులు, మూడు టీ20ల్లో 69 పరుగులు, ఒక టెస్ట్‌లో 24 పరుగులే సాధించింది. ప్రస్తుతం ఆమె ఫామ్‌ లో లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *