RCB

RCB: ఆర్సీబీ నుంచి ఆ ముగ్గురు ఔట్?

RCB: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్( ఐపీఎల్) చరిత్ర ఒక్కసారి కూడా కప్పు గెలువకపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025లో కప్పు కొట్టాలని భావిస్తున్న బెంగళూరు పలువురు స్టార్ ప్లేయర్స్ సైతం వదుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 18వ సీజన్ కు ముందు మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటైన్‌పై బెంగళూరు తన జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అయితే, ముగ్గురు స్టార్‌ క్రికెటర్లను ఆర్సీబీ వదులుకోబోతున్నదట. రిటెన్షన్‌, రైట్‌ టు మ్యాచ్‌ ఆప్షన్‌తో కలిపి ఆరుగురిని తమవద్ద ఉంచుకొనే వెసులుబాటు కల్పిస్తుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో ఐదుగురితో కూడిన రిటెన్షన్ లిస్ట్‌ను ఆర్సీబీ సిద్ధం చేసినట్లు సమాచారం. విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాళ్‌, రజత్ పటీదార్, విల్‌జాక్స్‌ లను రిటైన్ చేసుకోవాలని భావిస్తుందట ఆర్సీబీ. ఐపీఎల్ 17వ సీజన్ లో ఘోరంగా విఫలమైన కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌, కామెరూన్ గ్రీన్ లను ఆర్సీబీ పక్కన పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

Also Read: ఒక్క మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులు.. 

RCB: డుప్లెసిస్ స్థానంలో మరో యంగ్ స్టార్ కు కెప్టెన్ గా అవకాశం ఇవ్వాలని కూడా ఆలోచిస్తుందని తెలుస్తోంది. కాగా, నవంబర్‌ రెండో వారంలో దుబాయ్‌లో మెగా వేలం నిర్వహించాలని బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. గతేడాది కూడా దుబాయ్ లోనే మినీ వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాంఛైజీలు కూడా తమ రిటైన్ జాబితాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AUS vs PAK T20: పాకిస్తాన్ ని వాషౌట్ చేసిన ఆసీస్.. టీ20 సిరీస్ కైవసం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *