RC16

RC16 సెట్ లో పాల్గొన్న బాలీవుడ్ వైరల్ స్టార్!

RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్ తో దారుణమైన ప్లాప్ ని మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం యంగ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో తన కెరీర్ 16వ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు మేకర్స్. హైదరాబాద్ లో సినిమా సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ లో బాగా వైరల్ అయిన స్టార్ మీర్జాపూర్ నటుడు దివ్యెందు శర్మ కూడా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. లేటెస్ట్ గా తాను సినిమా సెట్స్ లో అడుగు పెట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే రామ్ చరణ్ తో కూడిన సీన్స్ లోనే పాల్గొన్నట్టుగా టాక్. ఈ సినిమాలో మున్నాభయ్యా నెగిటివ్ షేడ్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. మరి చూడాలి ఈ క్రేజీ కలయికలో సినిమా ఎలా ఉంటుందో అనేది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *