RBI: రైతు సోదరులకు శుభవార్త చెప్పిన ఆర్బీఐ.. ఇక నుంచి 2 లక్షలు..

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రైతులకు శుభవార్త ప్రకటించింది. వ్యవసాయ అవసరాల కోసం, రైతులు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 1.6 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆర్బీఐ తాజాగా ఈ పరిమితిని రూ. 2 లక్షల వరకూ పెంచింది. ఈ కొత్త నిబంధనలు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ నిర్ణయం ప్రధానంగా రైతుల వ్యవసాయ ఖర్చులు, ద్రవ్యోల్బణం పెరిగిన దృష్ట్యా తీసుకోబడింది. ఆర్బీఐ ప్రకారం, పంట సాగు కోసం రైతులకు ఎలాంటి భూ పూచీకత్తు లేకుండా రుణం మంజూరు చేయాల్సిన నిబంధన ఉన్నప్పటికీ, కొన్ని బ్యాంకులు ఈ విధానాన్ని క్రమంగా అమలు చేయడం లేదు. కొన్ని బ్యాంకులు, ముఖ్యంగా డిపాజిట్లు ఉన్న రైతులకు మాత్రమే ఈ రుణాలు మంజూరు చేస్తాయి, దీంతో రైతులు ప్రైవేట్ రంగ రుణదాతల వద్ద అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకొని అప్పులపాలవుతున్నారు.

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, ఆర్బీఐ ఈ రుణ సదుపాయాన్ని మరింత మెరుగుపర్చింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ చర్య వలన చిన్న, సన్నకార రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని, 86 శాతం మంది రైతులు దీనితో లాభపడే అవకాశం ఉందని వివరించింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *