టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నయా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ న్యూజిలాండ్ జట్టుతో జరుగుతు రెండో టెస్టులోనూ రాణించాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈక్రమంలో ఓ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు తొలి స్థానంలో ఉన్న ఆసీస్ బౌలర్ నాథన్ లైయన్(187)ను అశ్విన్ వెనక్కినెట్టాడు. ప్రస్తుతం అశ్విన్ 188 వికెట్లతో ముందున్నాడు. వీరిద్దరి తర్వాత ఆస్ట్రేలియా బౌలర్స్ పాట్ కమిన్స్(175), మిచెల్ స్టార్క్(147) ఉన్నారు.
కాగా, భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు విషయానికి వస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డేవాన్ కాన్వే (76; 141 బంతుల్లో 11 ఫోర్లు), రచిన్ రవీంద్ర(65; 105 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)లు అర్ధ శతకాలతో రాణించగా.. మిచెల్ శాంట్నర్(33) పర్వాలేదనిపించాడు. మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు.
ఇక, భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లతో అదరగొట్టాడు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగి మరోసారి నిరాశపర్చాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో రోహిత్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు ఒక పరుగు మాత్రమే చేసింది. శుభ్‌మన్ గిల్ (6 ), యశస్వి జైస్వాల్ (10)లు క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. భారత్, న్యూజిలాండ్ కంటే ఇంకా 243 పరుగులు వెనకపడి ఉంది.