Ravi Teja: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న కొత్త సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉండబోతున్నారన్న ప్రచారం ఇటీవల సోషల్ మీడియాను ఊపేసింది. ఈ వార్తలు అభిమానుల్లో కూడా పెద్ద చర్చ మొదలైంది. దీంతో రవితేజ టీమ్ ముందుకు వచ్చి స్పష్టమైన వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ సమాచారం పూర్తిగా అబద్ధమని, సినిమాలో ఆరు హీరోయిన్‌లు ఉన్నారన్న విషయం నిజం కాదని టీమ్ ఖండించింది. ఎలాంటి ఆధారం లేకుండా లైమ్‌లైట్ కోసం ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని పేర్కొంది. వాటిని నమ్మొద్దని స్పష్టం చేసింది.
Also Read: Stranger Things 5: స్ట్రేంజర్ థింగ్స్-5 సంచలనం.. నెట్‌ఫ్లిక్స్ రికార్డులు షేక్!
ప్రస్తుతం ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు, నటీనటుల ఎంపిక కార్యక్రమాలు మాత్రమే కొనసాగుతున్నాయని టీమ్ తెలిపింది. కథకు అవసరమైన పాత్రలు తేలిన తర్వాతే అధికారిక అప్‌డేట్స్‌ను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. సినిమా మీద అధికారిక సమాచారం రాకముందే హీరో, హీరోయిన్, విలన్ వంటి అంశాలపై రూమర్స్ రావడం కొత్తేమీ కాదని టీమ్ తెలిపినా, ఈసారి వైరల్ అయిన ప్రచారం చాలా దూరం వెళ్లడంతో స్పందించాల్సి వచ్చిందని తెలిపింది. రవితేజ టీమ్ విడుదల చేసిన ప్రకటనతో ఆరుగురు హీరోయిన్ల విషయం మీద నెలకొన్న సందేహాలకు పూర్తిగా ముగింపు లభించింది. సోషల్ మీడియాలో పాకిన రూమర్స్‌కి పుల్‌స్టాప్‌గా మారింది.

