Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ సినిమాతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. భాను బోగవరపు డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో రవితేజ డైనమిక్ రోల్‌లో మెరవనున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ‘మాస్ జాతర’ పూర్తి కాకముందే రవితేజ తన తదుపరి ప్రాజెక్ట్‌పై కన్నేశారు.‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు శ్రీవాస్.. రవితేజ కోసం ఓ జోరైన స్క్రిప్ట్ సిద్ధం చేశారు.
Also Read: Sarangapani Jathakam: ‘సారంగపాణి జాతకం’తో ప్రియదర్శి మరోసారి హవా.. సమ్మర్‌లో కామెడీ హంగామా!
Ravi Teja: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుందని టాక్ నడిచింది. కానీ, ఊహించని విధంగా రవితేజ ఈ ప్రాజెక్ట్‌ను వదులుకున్నట్లు సమాచారం. దీంతో శ్రీవాస్ ఈ కథను యంగ్ టాలెంట్ సందీప్ కిషన్‌కు చెప్పగా, సందీప్ ఒక్కసారిగా ఓకే చేశారట. త్వరలోనే ఈ చిత్రం అఫీషియల్‌గా సెట్స్‌పైకి వెళ్లనుంది. రవితేజ నిర్ణయంతో ఆయన ఫ్యాన్స్‌కు షాక్ తగిలినా, సందీప్ కిషన్ అభిమానులు మాత్రం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ కొత్త కాంబో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి!