Neninthe Re Release: మాస్ మహరాజా రవితేజ కెరీర్ లో ‘నేనింతే’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రానికి గానూ రవితేజ ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నాడు. అలానే బెస్ట్ రైటర్ గా పూరి జగన్నాథ్, బెస్ట్ ఫైట్ మాసర్స్ గా రామ్ లక్ష్మణ్ అవార్డులు పొందారు. జనవరి 26వ తేదీ రవితేజ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘నేనింతే’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రవితేజ నటుడిగా 75వ మైలు రాయిని చేరుకున్నాడు. అతని 75వ చిత్రం ‘మాస్ జాతర’ మూవీ గ్లింప్స్ కూడా జనవరి 26న రాబోతోంది. భాను భోగవరపు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘మాస్ జాతర’ మే 9వ తేదీన విడుదల కాబోతోంది.
 
							
