Ravi Teja Mass Jathara: ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ సినిమా మాస్ జాతర. డైరెక్టర్ భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ తర్వాత దాదాపు టాకీ పార్ట్ అంతా పూర్తి అయిపోయినట్టే అని తెలుస్తోంది. రవితేజ ఫ్యాన్స్ ఈ మధ్య మిస్ అవుతున్న కామెడీ, మాస్ మిక్స్ చేసి ఈ మాస్ జాతర సినిమాలో పెడుతున్నారట. అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ కెరీర్లో భారీ హిట్ ఇడియట్ సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ చూపుల్తో గుచ్చి గుచ్చి ని రీమిక్స్ చేయనున్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ పాట అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి ఊపు తెప్పించిన పాట. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే ఇప్పుడు మరోసారి థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ చేయడం కంఫర్మ్. ఈ పాటను రీమిక్స్ చేస్తే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అని చెప్పాలి.
