Ravi Teja: నా కొడుకు సందీప్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నాడు

Ravi Teja: మాస్ మహరాజా రవితేజ కొత్త చిత్రం “భర్త మహాశయులకు విజ్ఞప్తి” విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది. సినిమాలో రవితేజ ఎనర్జిటిక్ నటన ఆకట్టుకుంటోంది.

ఓ ఇంటర్వ్యూలో రవితేజ తన కుమారుడు మహాధన్ కెరీర్ గురించి మాట్లాడారు. తన కుమారుడికి తాను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు.“ఇది చేయి.. అది చేయి అని నేను ఎప్పుడూ చెప్పను. వాడి భవిష్యత్తు వాడిదే” అని రవితేజ అన్నారు. పిల్లలు తీసుకునే నిర్ణయాలను తల్లిదండ్రులు గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ప్రస్తుతం మహాధన్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వ టీంలో పనిచేస్తున్నాడని ఆయన చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడితో కలిసి మహాధన్ మూవీ మేకింగ్ నేర్చుకుంటున్నాడని తెలిపారు. వాళ్ల కెరీర్ వాళ్లే నిర్మించుకుని ముందుకు సాగుతారని రవితేజ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *