Rave Party: హైదరాబాద్ నగర శివార్లలోని ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న భారీ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ దాడుల్లో 14 మంది మహిళలతో సహా మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో పలువురు వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నగరానికి కొద్ది దూరంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌పై టాస్క్‌ఫోర్స్ మరియు స్థానిక పోలీసుల బృందం సంయుక్తంగా దాడి చేసింది. పార్టీలో పాల్గొన్న మొత్తం 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Hanamkonda: కొడుకు పట్టించుకోవట్లేదని మూడు కోట్ల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన తెలంగాణ రెడ్డి
వీరిలో 14 మంది మహిళలు ఉన్నారు. ఫామ్‌హౌస్‌ను తనిఖీ చేయగా, పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు (నార్కోటిక్స్), నిషేధిత డ్రగ్స్‌తో పాటు, మద్యం సీసాలు, హుక్కా పరికరాలు మరియు పార్టీకి సంబంధించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు, వ్యాపారవేత్తలు, అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ పార్టీని హైదరాబాద్‌కు చెందిన ఒక ఈవెంట్ ఆర్గనైజర్ గుట్టుగా నిర్వహించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.