Ration Cords:తెలంగాణలో రేషన్‌కార్డులపై లబ్ధిదారుల కుటుంబాలకు ప్రభుత్వం శుభవార్తను అందజేసింది. జనవరిలోనే కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకూ తాత్సారం చేసింది. ఇప్పుడు త్వరలో నూతన రేషన్‌కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఎన్నాళ్ల నుంచి ఎదురుచూపులు త్వరలో తీరనున్నాయి.
Ration Cords:మార్చి 1న కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఒకే రోజున లక్ష కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకే కొత్త రేషన్‌కార్డుల పంపిణీని ప్రభుత్వం పరిమితం చేయనున్నది.
Ration Cords:ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం మార్చి నెల 8 తర్వాత ఇతర అన్నిప్రాంతాల్లో రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నట్టు తెలిసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. తొలుత మార్చి 1న కార్డులను పంపిణీ చేసే మూడు జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.