Ration Card updates: రేషన్ కార్డుల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపివార్తలు అందించింది. ఏప్రిల్ నెల నుంచి సన్నబియ్యం పంపిణీ అంశం పాతదేనైనా మరిన్ని కొత్త అంశాలను పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తాజాగా వెల్లడించారు. ఈ నెల 30 ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో రేషన్‌కార్డులకు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. ఇక ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుల ద్వారా సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నారు.
Ration Card updates: రాష్ట్రవ్యాప్తంగా 3.10 కోట్ల మందికి వచ్చే నెల నుంచి సన్నబియ్యం అందనున్నది. అంటే రాష్ట్రంలోని 85 శాతం మందికి ఈ ప్రయోజనం అందనున్నది. ఇప్పటికే 90 లక్షల కార్డులు ఉండగా, మరో 30 లక్షల నూతన కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. దీంతో రేషన్ కార్డుల సంఖ్య కోటికి దాటుతుంది.
Ration Card updates: రేషన్‌కార్డుల ద్వారానే సన్నబియ్యంతోపాటు గతంలో ఇచ్చిన మాదిరిగా నిత్యావసరాలను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని సర్కార్ వెల్లడించింది. పప్పు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు ఇతర 9 రకాల నిత్యావసరాలను విడతల వారీగా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రేషన్ లబ్ధిదారులకు వెసులుబాటు కలగనున్నది.
Ration Card updates: రేషన్‌కార్డులు అందుబాటులో ఉన్నా లేకున్నా, లబ్ధిదారుల జాబితాలో ఉంటే రేషన్ బియ్యం, ఇతర సరుకులను ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వలస కూలీలు, ఇతర ఉపాధి కోసం వెళ్లిన వారికి వెసులుబాటు కల్పించినట్టవుతుంది. డ్రా సిస్టమ్ ద్వారా ఈ అవకాశం కల్పిస్తారు.
Ration Card updates: కొత్తగా అందజేసే రేషన్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. అందులో ఎలాంటి చిప్ ఉండదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కొత్త రేషన్‌కార్డులపై ప్రధాని ఫొటో ఉండాలా? వద్దా? అన్న అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తున్నది. ఒకవైపు సీఎం ఫొటో, మరోవైపు ప్రధాని ఫొటో ఉండే అవకాశం ఉన్నదని విశ్వసనీయ సమాచారం.
Ration Card updates: మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే? కార్డుల రంగు విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కార్డుల ముద్రణ కూడా రెడీ అయినట్టు తెలిసింది. ఈ మేరకు బీపీఎల్ కుటుంబాలకు ఎరుపు రంగు కార్డులు, ఏపీఎల్ కుటుంబాలకు ఆకుపచ్చ రంగు కార్డులు అందజేసేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నది. వాస్తవంగా రేషన్ పంపిణీ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.10,665 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రూ.5,489 కోట్లను కేంద్రం, రూ.5,175 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది.