రతన్ టాటా ప్రస్థానం..

ప్రముఖ పారిశ్రామిక‌వేత్త‌ రతన్ టాటా బుధవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆస్ప‌త్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధ‌వారం రాత్రి 11.30 గంట‌ల‌కు క‌న్నుమూశారు. టాటా మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

రతన్ టాటా జననం..

ప‌ద్మ‌విభూష‌ణ్ గ్ర‌హీత‌, టాటా స‌న్స్ గౌర‌వ చైర్మ‌న్ ర‌త‌న్ టాటా..1937 డిసెంబ‌ర్ 28న నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు రతన్‌ టాటా జన్మించారు.8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఆయ‌న ముంబైలోని కాంపియ‌న్ స్కూల్‌లో చ‌దివారు. ఆ త‌ర్వాత కేథ‌డ్ర‌ల్ అండ్ జాన్ కాన‌న్ స్కూల్‌లో, షిమ్లాలోని బిష‌ప్ కాట‌న్ పాఠ‌శాల‌లోనూ త‌న చ‌దువు కొన‌సాగించారు.

1955లో న్యూయార్క్‌లోని రివ‌ర్‌డేల్ కంట్రీ స్కూల్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంత‌రం కార్నెల్ యూనివ‌ర్సిటీ నుంచి ఆర్కిటెక్క‌ర్ అండ్ స్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజినీరింగ్‌లో ప‌ట్టా పుచ్చుకున్నారు. ఆ త‌ర్వాత హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూల్‌లో చేరి అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేశారు.

రాయల్ బిజినెస్ ఎంట్రీ..

రతన్ టాటా 1962లో టాటా స్టీల్ లో చేర‌డం ద్వారా తన బిజినెస్ అరంగేట్రాన్ని ప్రారంభించారు.1991లో టాటా గ్రూపు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి సంస్థను ఎన్నో రెట్లు అభివృద్ధి చేశారు.1996లో టెలికమ్యూనికేషన్స్ కోసం టాటా టెలిసర్వీసెస్‌ని స్థాపించగా, 2004లో ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) ను స్థాపించారు.2012లో టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి రతన్ టాటా తప్పుకున్నారు. తిరిగి 2016 అక్టోబర్ నుంచి ఆరు నెలల పాటు టాటా గ్రూప్‌న‌కు తాత్కాలిక చైర్మన్‌గా ర‌త‌న్ టాటా వ్యవహరించారు.

పేదవాడి కోసం నానో..

రతన్ టాటా తీసుకువచ్చిన ఎన్నో సంస్కరణల్లో టాటా నానో ఒకటి. ప్రతి పేదవాడు కారులో తిరగాలి అనే సంకల్పం తో నానో కారుకు రూపకల్పన చేశారు. అలా 2009లో నానో కారును లక్ష రూపాయలకే ఇవ్వడం మొదలు పెట్టారు. నానో కార్ 2020 వరకు మార్కెట్ లో కొనసాగింది.

అవార్డులు, స‌త్కారాలు ఇవే..

దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ను 2000లో అందుకున్నారు.

2004లో మెడల్ ఆఫ్ ద ఒరియెంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే పురస్కారం

2007లో కార్నేజ్ మెడల్ ఆఫ్ ఫిలాంథ్రపీ అవార్డు

భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ 2008లో అందుకున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం 2006లో మహారాష్ట్ర భూషణ్ బిరుదు ఇచ్చి సత్కరించింది.

2008లో సింగపూర్ ప్రభుత్వం నుంచి హానరరీ సిటిజన్ అవార్డ్

2009లో ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్ అవార్డ్ ఫర్ ఇంజనీరింగ్ అవార్డ్

ALSO READ  KP Chowdary: డ్రగ్స్‌ పెడ్లర్‌, కేపీ చౌదరి ఆత్మహత్య

2009లో ఇటలీ నుంచి గ్రాండ్ ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ద ఇటాలియన్ రిపబ్లిక్ అని ఆ దేశ అత్యున్నత పురస్కారం

2010లో యేల్ యూనివర్సిటీ నుంచి లెజెండ్ ఇన్ లీడర్ షిప్ అవార్డ్

2012లో జపాన్ ప్రభుత్వం నుంచి గ్రాండ్ కార్డన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ పురస్కారం

2014లో హానరరీ నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ అంపైర్ పురస్కారం క్వీన్ ఎలిజబెత్ నుంచి అందుకున్నారు.

రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ నుంచి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు

2016లో ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి కమాండర్ ఆఫ్ లిజియన్ ఆఫ్ ద హానర్

2021లో అస్సాం వైభవ్‌తో రతన్ టాటాను సన్మానించారు

2023లో ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అందుకున్నారు

2023 మహారాష్ట్ర ఉద్యోగరత్న

వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ యూనివర్సిటీలు, దేశాల నుంచి గౌరవ డాక్టరేట్‌ను రతన్ టాటా అందుకున్నారు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *