ratan tata death

Ratan Tata Death: నూటికో కోటికో ఒక్కరు.. దేశవ్యాప్తంగా రతన్ టాటాకు నివాళులు!

Ratan Tata Death: నూటికో కోటికో ఒక్కరు పుడతారు. తమ ఉనికితో తమదైన శైలిని ప్రపంచవ్యాప్తం చేస్తారు. సింప్లిసిటీ.. దేశభక్తి.. దానగుణం.. దార్శనికత.. కాలానికి అనుగుణంగా ఎదగడం.. ఎదుగుతూ ఒదగడం ఇలా చెప్పుకుంటూ పోతుంటే.. రతన్ టాటా గుణగణాలను వివరించడానికి పదాలు చాలవు. గుండు సూది నుంచి విమానాల దాకా.. ఉప్పు నుంచి సూపర్ స్టోర్స్ దాకా.. సామాన్యమైన వ్యాపారం నుంచి సాఫ్ట్ వేర్ ఎంపైర్ దాకా..  అసలు మనిషికి అవసరమయ్యే ప్రతి వస్తువు తయారీలోనూ నిమగ్నమయిన వ్యాపార సామ్రాజ్యం ఏదైనా ఉంది అంటే అది టాటా గ్రూప్ మాత్రమే. దీని వెనుక ఉన్న శక్తి రతన్ టాటా. భారతదేశం గురించి మాట్లాడుకుంటే.. ఏ దేశ వ్యాపార వేత్త అయినా టాటా గురించి చెప్పుకోకుండా ఉండలేడు అంటే అతిశయోక్తి కాదు. రతన్ టాటా దేశానికి వ్యాపార వేత్త మాత్రమే కాదు. గొప్ప వితరణ శీలి. చేతికి ఎముక లేదు అంటారు కదా దానికి మన ముందు తిరుగాడిన రుజువు రతన్ టాటా. ఒకటీ రెండూ కాదు వేలాది కోట్ల రూపాయలు.. సహాయ నిధులకు ఇచ్చిన ప్రపంచంలోని ఏకైక వ్యాపార వేత్త ఆయన. ఒక్కటే ఉదాహరణ.. కరోనా సమయంలో ఏకంగా 1500 కోట్ల రూపాయలను ఒక్కసారే కరోనా బాధిత ప్రజల కోసం విరాళంగా ఇచ్చారు. ఇది చాలు ఆయన అద్భుత వ్యక్తిత్వాన్ని చెప్పడానికి. రతన్ టాటా మృతి దేశ పారిశ్రామిక రంగానికి తీరని లోటు. పూడ్చలేని అగాధం. ఒక దిగ్గజ శకం ముగిసింది. నభూతో నభవిష్యతి అంటారు కదా.. రతన్ టాటా లాంటి వ్యక్తి కూడా అంతే. ఆయన ముందు ఎవరూ లేరు.. ఆయన ఉన్నపుడు ఎవరూ లేరు.. ఆయన తరువాత కూడా ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగే వారు ఎవరు రారు. రాలేరు. ఇది నిజం. అందుకే ఆయన నూటికో కోటికో ఒక్కరు! 

Ratan Tata Death: భారత పారిశ్రామిక రత్నం రతన్ టాటా మరణం పట్ల దేశం అంతా విషాదం అలుముకుంది. వరుసగా ఆయన మరణానికి నివాళులు అర్పిస్తూ రాష్ట్రపతి, ప్రధాని దగ్గర నుంచి అందరూ తమ విషాదాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఎవరేం చెప్పారో ఇక్కడ తెలుసుకోవచ్చు.. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: దేశ నిర్మాణాన్ని కార్పొరేట్ వృద్ధి -నైతికత, శ్రేష్ఠతతో మిళితం చేసిన ఒక ఐకాన్‌ను భారతదేశం కోల్పోయింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత రతన్ టాటా టాటా గ్రూప్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు.

ALSO READ  Brinjal: జాగ్రత్త.. ఈ ఆరోగ్య సమస్యలుంటే వంకాయ తినకండి!

ప్రధాని నరేంద్ర మోడీ: టాటా ఒక దూరదృష్టి గల వ్యాపార నాయకుడు.  దయగల ఆత్మ కలిగిన  అసాధారణమైన మానవుడు. అతను భారతదేశంలోని పురాతన, అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలలో ఒకదానికి స్థిరమైన నాయకత్వాన్ని అందించాడు. అతని రచనలు బోర్డు గదికి మించినవి.

రాహుల్ గాంధీ: రతన్ టాటా విజన్ ఉన్న వ్యక్తి. అతను వ్యాపారం, దాతృత్వం రెండింటిలోనూ చెరగని ముద్ర వేశారు. ఆయన కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి నా ప్రగాఢ సానుభూతి.

గౌతమ్ అదానీ: భారతదేశం గొప్ప,దూరదృష్టి గల వ్యక్తిని కోల్పోయింది. టాటా ఆధునిక భారతదేశ మార్గాన్ని పునర్నిర్వచించారు. టాటా కేవలం వ్యాపార వేత్త మాత్రమే కాదు, భారతదేశ స్ఫూర్తిని కరుణతో మూర్తీభవించారు.

ఆనంద్ మహీంద్రా: రతన్ టాటా లేకపోవడాన్ని నేను అంగీకరించలేను. మిస్టర్ టాటాను మరచిపోలేరు. ఎందుకంటే మహానుభావులు ఎప్పటికీ మరణించరు.

సుందర్ పిచాయ్: రతన్ టాటాతో నా చివరి భేటీలో ఆయన దార్శనికత వినడం నాకు స్ఫూర్తిదాయకంగా ఉంది. అతను అసాధారణమైన వ్యాపార వారసత్వాన్ని వదిలివేశారు. భారతదేశంలో ఆధునిక వ్యాపార నాయకత్వాన్ని మార్గనిర్దేశం చేయడంలో, అభివృద్ధి చేయడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు.

చంద్రబాబు నాయుడు: రతన్ టాటా వంటి వారి దార్శనికత, చిత్తశుద్ధితో ప్రపంచంపై చిరస్థాయిగా ముద్ర వేసిన వాళ్ళు తక్కువ. ఈ రోజు మనం కేవలం ఒక వ్యాపార టైటాన్‌నే కాదు, నిజమైన మానవతావాదిని కోల్పోయాము.  అతని వారసత్వం అతను తాకిన ప్రతి హృదయంలో నివసించడానికి పారిశ్రామిక ప్రకృతి దృశ్యాన్ని మించిపోయింది. ఈరోజు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ, పరిశ్రమ, దాతృత్వం, దేశ నిర్మాణానికి ఆయన చేసిన విశేషమైన సహకారాన్నిఎవరూ మర్చిపోలేం.  అది ఎప్పటికీ తరాలకు స్ఫూర్తినిస్తుంది. ఆదర్శవంతమైన జీవితం గడిపిన వ్యక్తి. అందరూ ఫాలో కావలసిన ఒక ఐకానిక్ లెగసీ. 

 Also Read: భారత పారిశ్రామిక రత్నం రతన్ టాటా కన్నుమూత!

ALSO READ  Gold Rates Today: కాస్త నిదానించి బంగారం ధరలు.. వెండి ధరలు కూడా తగ్గాయి!

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *