Rashmika Mandanna: రష్మిక మందన్నా.. ఈ పేరు ఇప్పుడు సినీ పరిశ్రమలో మార్మోగిపోతోంది. పెద్ద సినిమాలతో యూత్‌ను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ, తాజాగా ‘మైసా’ అనే కొత్త సినిమాతో సర్‌ప్రైజ్ చేసింది. పోస్టర్‌లో రష్మిక లుక్ చూస్తే.. ఇది పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ చిత్రమని, ఆమె యాక్షన్‌తో మెస్మరైజ్ చేయనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ పోస్టర్‌లో ఆమె వైలెంట్ రోల్‌లో కనిపిస్తూ అనుష్క స్టైల్‌ను గుర్తుచేస్తోంది. అనుష్క తన కెరీర్ శిఖరంలో ‘అరుంధతి’తో యూత్‌లో మాస్ ఫాలోయింగ్ సంపాదించింది. ఆ సినిమాతో ఆమె మార్కెట్, రెమ్యునరేషన్ రెట్టింపైంది. ఇప్పుడు రష్మిక కూడా అదే దారిలో ‘మైసా’తో తన సత్తా చాటాలని చూస్తోంది. గ్లామర్ రోల్స్‌తో ఇప్పటివరకు ఆకట్టుకున్న ఈ భామ, ఇప్పుడు నటన, యాక్షన్‌లో తన పవర్ చూపించేందుకు సిద్ధమైంది. పాన్ ఇండియా స్టార్‌గా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, ఈ సినిమాతో తన ఫ్యాన్ బేస్‌ను మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తోంది.
