Rashmika: టాలీవుడ్లో స్టార్ కపుల్‌గా పేరుపొందిన రష్మిక మందన్న–విజయ్ దేవరకొండ పెళ్లి విషయంపై మరోసారి చర్చ మొదలైంది. ఫిబ్రవరిలో ఈ ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారన్న వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో రష్మిక ఒక ఇంటర్వ్యూలో స్పందించడంతో ఆ చర్చకు మరింత ఊపు వచ్చింది. హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వచ్చిన పెళ్లి ప్రశ్నలకు ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా, రూమర్లు ఖండించకుండా ఉండటమే ఆసక్తి కలిగిస్తోంది.
తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడనని రష్మిక చెప్పింది. పెళ్లి వంటి విషయాలు ఎప్పుడు వెల్లడించాలో తానే నిర్ణయిస్తానని, సరైన సమయం వచ్చినప్పుడు అభిమానులతో పంచుకుంటానని స్పష్టం చేసింది. నేను ఈ వార్తలను ఇప్పుడే ధ్రువీకరించలేను. అలాగని వీటిని ఇప్పుడు ఖండించనూ లేను., వివాహ వార్తలపై సందేహాన్ని అలాగే ఉంచింది. ఈ మాటలతో రూమర్లు మరింత బలపడ్డాయి.
అదే ఇంటర్వ్యూలో రష్మిక తన కెరీర్ గురించి మాట్లాడింది. ఈ ఏడాది వరుస విజయాలు అందుకోవడంతో ఎంతో సంతృప్తిగా ఉందని చెప్పింది. ఐదు సినిమాలు విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందటం తనకు ప్రత్యేక సంవత్సరంగా భావిస్తున్నానని తెలిపారు. పరిశ్రమలో స్థానం సంపాదించుకోవాలంటే ఎంతో కష్టపడాలని, భాషా పరమైన పరిమితులు పెట్టుకోకుండా అన్ని జానర్లలోనూ నటించాలని ప్రారంభం నుండి తీసుకున్న నిర్ణయం ఈరోజు ఫలితమిస్తోందని ఆమె చెప్పింది.
Also Read: Dil Raju: బాలీవుడ్ లో ఆరు సినిమాలు? .. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
పని విషయంలో ఎప్పుడూ బిజీగా ఉండే రష్మిక, డబుల్ షిఫ్టులు చేయడం కూడా కొత్తేమీ కాదని చెప్పింది. ఒక్కోసారి షూటింగ్స్ అనుకున్నట్లుగా జరగకపోవడం సహజమేనని, మీటింగ్స్, రిహార్సల్స్ కారణంగా కూడా ఆలస్యం అవుతుందని వెల్లడించింది. పని నుంచి విరామం కావాలనిపించినప్పుడు ‘నరుటో’ కార్టూన్ చూస్తే తనకు రిలాక్స్ ఫీలింగ్ వస్తుందని చెప్పింది.
ఇప్పటికే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించిన రష్మిక–విజయ్ జంటకు సినీ అభిమానుల మధ్య ప్రత్యేక క్రేజ్ ఉంది. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారన్న మాటలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిగిందని కూడా వార్తలు వచ్చాయి. ఈ వేడుక కుటుంబ సభ్యుల మధ్య జరిగినట్లు ప్రచారం జరిగినప్పటికీ, అధికారికంగా మాత్రం ఏ సమాచారం బయటికి రాలేదు.
ఇప్పుడు ఫిబ్రవరి 2026లో వివాహం జరగబోతుందన్న ప్రచారం మళ్లీ మొదలైంది. అయితే రష్మిక చేసిన తాజా వ్యాఖ్యలు ఈ వార్తలను నిలిపివేయకపోవడం, ఖండించకపోవడం కారణంగా అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. నిజంగా పెళ్లి సమయం దగ్గరపడిందా? లేక ఇవన్నీ కేవలం రూమర్లేనా? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు.

