Bunny-Rashmika: పుష్పతో బన్నీ, రష్మిక ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. రష్మిక అయితే వరుస విజయాలతో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది.. ఇప్పుడు వీళ్లిద్దరూ మరోసారి స్క్రీన్ పై సందడి చెయ్యబోతున్నారని తెలుస్తోంది.. అల్లు అర్జున్-సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న మూవీలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారట.. ఇప్పటికే దీపికను అఫీషియల్ కన్ఫమ్ చేసేశారు. మృణాల్ ఠాకూర్ కూడా దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్టే అంటున్నారు. ఇక ముచ్చటగా మూడో భామగా క్రష్మిక యాక్ట్ చెయ్యబోతుందంటున్నారు.. మొన్నటివరకు జాన్వీ కపూర్ పేరు వినిపించింది కానీ ఇప్పుడు రష్మికతో టీమ్ సంప్రదింపులు జరుపుతోందని టాక్.. అన్నీ కుదిరితే పుష్ప-శ్రీవల్లి జంటను మరోసారి స్క్రీన్ మీద చూడొచ్చన్నమాట..
Also Read: Siddu Jonnalagadda: మరో కిరాక్ టైటిల్ తో వస్తున్న స్టార్ బాయ్ సిద్ధు..
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో, భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా అసోసియేట్ కాబోతున్నారని టాక్..
మరీ ముఖ్యంగా విల్ స్మిత్, రాక్ లాంటి పాపులర్ యాక్టర్స్ పేర్లు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి.. ఇప్పుడు స్టార్స్ అందరూ కొత్తగా థింక్ చేస్తున్నారు. క్యారెక్టర్ నచ్చితే లాంగ్వేజ్ చూడట్లేదు. లైగర్ లో మైక్ టైసన్ కనిపిస్తే మంచి అప్లాజ్ వచ్చింది. హాలీవుడ్ యాక్టర్స్ కూడా మిగతా భాషల్లో యాక్ట్ చేస్తే బాక్సీఫీస్ దగ్గర వసూళ్ల జాతర మామూలుగా ఉండదు కదా..