Rashmika Mandanna: సినిమా సెలబ్రిటీల జీవితంలో సోషల్ మీడియా పెద్ద పాత్ర పోషిస్తుంది. అభిమానుల ప్రేమ, క్రేజ్ తో పాటు కొన్నిసార్లు నష్టాలు కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్స్ తరచుగా లేని వివాదాల్లో ఇరుక్కొని, నెటిజన్ల ట్రోల్స్ కు గురవుతుంటారు. ఎవరి డ్రస్సులు, ఎవరి వ్యాఖ్యలు – ఏదో ఒక కారణంతో సోషల్ మీడియాలో వారిపై నెగటివ్ కామెంట్స్ వస్తుంటాయి.
కన్నడ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక, ‘పుష్ప’ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్‌గా మారారు. అయినా కూడా ఆమెను ట్రోల్స్ వదలడం లేదు.
ఇది కూడా చదవాడి: Putin-kim: ట్రంప్-పుతిన్ భేటీకి ముందు కిమ్‌తో పుతిన్ ఫోన్ సంభాషణ: శాంతి చర్చలపై ఉత్కంఠ
తాజాగా రష్మిక తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ, “నేను అన్ని భావోద్వేగాలు కలిగిన అమ్మాయిని. కానీ వాటిని బయట పెట్టడం ఇష్టం ఉండదు. అలా చేస్తే కెమెరా కోసం చేస్తున్నానని అంటారు. నాపై కావాలనే కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. కొందరైతే డబ్బు ఇచ్చి మరీ ట్రోల్ చేయిస్తున్నారు. నా ఎదుగుదలను అడ్డుకోవాలనుకుంటున్నారు. ఎందుకు ఇలా క్రూరంగా మారుతున్నారో అర్థం కావడం లేదు” అని చెప్పారు.
అలాగే, “నాపై ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు… కానీ ప్రశాంతంగా ఉండండి. ఇతరులను బాధపెట్టడం ఆపండి” అంటూ తన మనసులోని బాధను చెప్పుకున్నారు.
ప్రస్తుతం రష్మిక ‘కుబేర’ సినిమాలో విజయాన్ని అందుకున్నారు. త్వరలో తెలుగు, తమిళ్ భాషల్లో ‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమా, మహిళా ప్రాధాన్యమైన ‘మైస’ చిత్రం, అలాగే హిందీలో ‘తామా’ సినిమాలో నటిస్తున్నారు.