Ramcharan: గేమ్ చేంజర్ అట్టర్ ప్లాప్ కావడంతో రామ్ చరణ్ తానూ తదుపరి చేయబోయే సినిమాలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం బుచ్చి బాబు సినిమా రెగ్యులర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కాస్త బ్రేక్ రావడంతో డైరెక్టర్ సుకుమార్ తో భేటీ అవ్వడానికి అబుదాబికి వెళ్ళాడు. బుచ్చి బాబు సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ స్టోరీ గురించి అబుదాబి లో గత రెండు రోజుల నుండి చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికని తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ‘పుష్ప’ సిరీస్ కి రష్మిక నటన కూడా చాలా ప్లస్ అయ్యింది. రామ్ చరణ్ తో తీయబోయే సినిమాలో కూడా హీరోయిన్ పెర్ఫార్మన్స్ కి ఫుల్ స్కోప్ ఉందట. ఆ క్యారక్టర్ కి రష్మిక తప్ప ఎవ్వరూ న్యాయం చేయలేరని సుకుమార్ కి అనిపించడంతో ఆమెని ఫిక్స్ చేద్దామని రామ్ చరణ్ తో అన్నాడట. దీంతో రామ్ చరణ్ కూడా అందుకు ఒప్పుకున్నాడని తెలుస్తుంది.
