Rashmika Mandanna: నేషనల్ క్రష్ రశ్మిక దూకుడు పెంచేస్తోంది. ఇటీవల ‘పుష్ప2’తో హిట్ కొట్టిన రశ్మిక త్వరలోనే ‘గర్ల్ ఫ్రెండ్’ తో రానుంది. ఇక ‘పుష్ప2’లో రశ్మిక కు నేషనల్ అవార్డ్ వస్తుందనే సన్నిహితులు బలంగా నమ్ముతున్నారు. అదే ఊపులో బాలీవుడ్ లోనూ బిజీ అవుతోంది రశ్మిక. గతేడాది ‘యానిమల్’తో బంపర్ హిట్ కొట్టిన రశ్మిక విక్కీ కౌశల్ తో కలసి నటించిన ‘చావా’ రిలీజ్ కి రెడీగా ఉంది. దీనితో పాటు ధనుష్ తో నటించిన ‘కుబేర’ సినిమా కూడా పూర్తయింది.
ఇది కూడా చదవండి: Women’s Premier League: భారతదేశంలో మహిళల క్రికెట్ లీగ్ మూడవ సీజన్. కోసం చిన్న-వేలం
Rashmika Mandanna: సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న ‘సికిందర్’ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇవి కాకుండా ‘స్ట్రీ2’ నిర్మాతలు మడ్డోక్ ఫిలిమ్స్ అధినేతలు తీస్తున్న ‘థామ’ సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది రశ్మిక. హారర్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానాకి జోడీగా నటిస్తోంది. ‘పుష్ప2’ సక్సెస్ తో అమ్మడి పారితోషికం కూడా భారీగా పెరిగింది.
Rashmika Mandanna: సినిమాకు పది కోట్లవరకూ ఛార్జ్ చేస్తున్నట్లు వినికిడి. దక్షిణాది కంటే బాలీవుడ్ లోనే బాగా బిజీ అవుతున్న రశ్మిక తన బోయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండతో మూడోసారి నటించబోతోంది. మరి రాబోయే సినిమాలతో రశ్మిక ఇంకెన్ని విజయాలను అందుకుంటుందో చూడాలి.