Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్ చేసింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. ఈ చాట్‌లో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు రష్మిక ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఒక అభిమాని రష్మికను ఉద్దేశిస్తూ, ‘మీరు ప్రభాస్‌తో ఎప్పుడు నటిస్తారు? ఒకవేళ మీరిద్దరూ నటిస్తే, ఆ సినిమా కాంబోకు వచ్చే హైప్‌కు థియేటర్‌కు నా శవాన్ని తీసుకెళ్లండి’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.
Also Read: Bigg Boss 9: బిగ్‌బాస్ 9వ వారం నామినేషన్స్: తనుజ, దివ్య, భరణిల మధ్య తీవ్ర వాగ్వివాదం!
దీనికి స్పందించిన రష్మిక మందన్న, తనకు కూడా ప్రభాస్‌తో కలిసి నటించాలనే ఆసక్తి ఉందని స్పష్టం చేసింది. “ఆయన చాలా మంచి యాక్టర్. ఆయనతో నటిస్తే నా కెరీర్ వేరే స్థాయిలో ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇదంతా ప్రభాస్ చూస్తాడని అనుకుంటున్నా” అని ఆమె పేర్కొంది. రష్మిక చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. తమ హీరో రేంజ్ అంటే ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. రష్మిక కోరిక త్వరలో తీరి, ఈ ఇద్దరు స్టార్స్ కలిసి తెర పంచుకుంటారేమో చూడాలి.

