Rashmika Mandanna

Rashmika Mandanna: రష్మిక కి బ్యాడ్ టైం స్టార్ట్?

Rashmika Mandanna: రష్మిక మందన్నా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలతో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ, ఇతర హీరోయిన్లకు ఏ మాత్రం పోటీ లేనంతగా ఆధిపత్యం చెలాయిస్తోంది. ‘పుష్ప-2‘ గ్రాండ్ సక్సెస్, ‘ఛావా’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ నేషనల్ లెవెల్‌లో తన సత్తా చాటింది రష్మిక. కానీ, ఇప్పుడు ఈ అమ్మడికి బ్యాడ్ టైమ్ తప్పట్లేదని చెప్పాలి.టాలీవుడ్‌లో హీరో నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమా ఇటీవల విడుదలై యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. ఈ చిత్రంలో మొదట రష్మికనే హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం శ్రీలీల చేతికి వెళ్లింది.

ఇది కూడా చదవండి: Mega 157: సౌండ్ ఇంకా గట్టిగా రావాలి . . రప్ఫాడించేద్దాం.. చిరు – అనిల్ రావిపూడి ప్రమోషన్స్ స్టార్ట్ !

అయితే, ఈ సినిమాలో శ్రీలీల పాత్రపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ‘రష్మిక ఈ సినిమా చేయకపోవడం బెటర్’ అని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.కానీ, బాలీవుడ్‌లో మాత్రం రష్మికకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన ‘సికందర్’ సినిమా భారీ హైప్‌తో రిలీజైనప్పటికీ, ప్రేక్షకుల నుంచి నెగెటివ్ రెస్పాన్స్‌ను ఎదుర్కొంది. ఈ ఫ్లాప్‌తో రష్మిక బాలీవుడ్‌లో బుక్ అయ్యిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సౌత్‌లో ఫ్లాప్‌ను తప్పించుకున్న ఈ బ్యూటీ, నార్త్‌లో మాత్రం తప్పించుకోలేకపోయింది. మొత్తంగా చూస్తే, రష్మిక కెరీర్‌లో ఇది ఒక ఊహించని ట్విస్ట్ అని చెప్పక తప్పదు..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *