Vijay-Rashmika: ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ కలిసి కనిపించడంతో వీరి రిలేషన్ గురించి మరోసారి చర్చలు ఊపందుకున్నాయి. ఒకే కారులో ప్రయాణిస్తున్న వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జోడీ రిలేషన్‌లో ఉన్నారనే పుకార్లు జోరందుకున్నాయి. ఇటీవల రష్మిక నటించిన ‘కుబేర’ సినిమా విడుదల సన్నాహాల్లో ఉండగా, విజయ్ సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Shilpa Shetty: శిల్పా శెట్టి సామ్రాజ్యం: నటనతో పాటు రెస్టారెంట్ వ్యాపారంలో హవా!
Vijay-Rashmika: “శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రష్మిక నటించిన ‘కుబేర’ సినిమా కోసం ఎదురుచూస్తున్నా” అని పోస్ట్ చేశారు. విజయ్ ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ సినిమాతో బిజీగా ఉండగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, ఈ జోడీ మూడోసారి స్క్రీన్‌పై సందడి చేయనుంది. అభిమానులు ఈ వార్తలతో ఉత్సాహంగా ఉన్నారు.
View this post on Instagram