Devara

Devara: దేవరను మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోయిన్స్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర సినిమా శుక్రవారం(సెప్టెంబర్) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది.తొలి షో నుంచే పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. భాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు అనిరుధ్ ఇచ్చిన బీజియం అదిరిపోయిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Devara: కాగా,ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించింది. అయితే ముందుగా ఆమె స్థానంలో దర్శకుడు కొరటాల శివ అలియా భట్ ను అనుకున్నారు. కానీ అప్పటికే ఆమె ఆర్ఆర్ఆర్ లో కనిపించడంతో బ్యాక్ టూ బ్యాక్ వద్దనుకుని ఆమెను పక్కన పెట్టి.. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ తీసుకుందామని అనుకున్నారు. ఆమెను అప్రోచ్ అయి కథను కూడా వినిపించారు కొరటాల. కానీ మిగితా ప్రాజెక్టులతో బిజీగా ఉంటడంతో మృణాల్ ఈ సినిమా ఛాన్స్ మిస్ చేసుకుందట.

Also Read: దేవర మూవీలో జాన్వీ కపూర్ ఉందా? లేదా?

Devara: ఇక మరో హీరోయిన్ కోసం నేషనల్ క్రష్ రష్మిక మంధానను అనుకున్నారట. కానీ ఆమె ఆ పాత్రపై అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ఫైనల్ గా మళ్లీ బాలీవుడ్ హీరోయిన్ ల వైపే ఫోకస్ చేసిన కొరటాల జాన్వీ కపూర్ ను ఫస్ట్ పార్ట్ కు హీరోయిన్ గా తీసుకున్నారు. ఇంకో హీరోయిన్ గా మరాఠీ నటి శ్రుతి మరాఠేను సెలక్ట్ చేశారు. ఈమె దేవర పార్ట్ 2లో కనిపించనుంది. శ్రుతి పాత్ర తక్కువే అయిన ఇంఫాక్ట్ ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో జాన్వీ పాత్ర ఎందుకు ఉందో అంటూ ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. కేవలం పాట, కొన్ని సన్నివేశాల్లో ఆమె కనిపిస్తుందని..కొంతమంది ఫ్యాన్స్ హర్టవుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *