Rape Case:సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఎనిమిదేండ్ల చిన్నారిపై ముగ్గురు యువకులు సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. తన ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ ఇప్పిస్తామని నమ్మించి తీసుకెళ్లారు ఆ దుండగులు. ఏకంగా సమీపంలోని చెట్లపొదల్లోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. ముగ్గురు నిందితులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Rape Case:శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఊరంత ఒక్కసారిగా భగ్గుమన్నది. చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన కామాంధులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటన మరోచోట జరగకుండా ఉండాలంటే ఆ ముగ్గురికీ కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ దుండగులకు ఎవరూ సాయంగా వెళ్లవద్దని నిర్ణయించుకున్నారు.