Rape Case: హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున విదేశీ పర్యాటకురాలిపై లైంగికదాడి కేసును పోలీసులు ఛేదించారు. ఎట్టకేలకు ఈ దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జరిగిన దాడి ఘటన గురించి పోలీసులు వెల్లడించారు. ఆ యువతిని చాకచక్యంగా మోసగించి లైంగికదాడికి పాల్పడ్డాడు ఆ దుండగుడు. ఈ ఘటనపై నగరంలోనే కాదు, దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ పర్యాటకులపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తమవుతున్నది.
Rape Case: సంచలనం సృష్టించిన జర్మనీ యువతిపై లైంగికదాడి కేసు గురించి పహాడీ షరీఫ్ పోలీసులు వివరాలను వెల్లడించారు. మార్చి తొలివారంలో జర్మనీ యువతి, ఓ యువకుడు హైదరాబాద్ నగరానికి వచ్చారు. వారు తమ స్నేహితుడి ఇంటిలో ఉంటూ నగరాన్ని సందర్శిస్తున్నారు. ఆ జర్మనీ యువతి, యువకుడు ఇద్దరినీ నగరాన్ని చూపిస్తానంటూ అస్లాం అనే యువకుడు కారులో తీసుకెళ్లాడు.
Rape Case: ఓ చోటుకు తీసుకెళ్లాక ఫొటోలు దిగేందుకు ఆ జర్మనీ యువకుడు ఒక్కడే కారు దిగాడు. ఇదే అదనుగా భావించిన ఆ దుండగుడు అస్లాం.. కారును యూటర్న్ తీసుస్తానని చెప్పి జర్మనీ యువతి కారులో ఉండగానే తీసుకెళ్లాడు. ఏకంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. చంపుతానని బెదిరించి.. ఆ జర్మనీ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి ఆ యువతి పహాడీ షరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు విచారణ జరిపిన పోలీసులు నిందితుడు అస్లాంను అరెస్టు చేశారు.