Rape Case: మహిళను ఆటవస్తువుగా మార్చారు అనడానికి ఈ అమానుష ఘటన నిదర్శనంగా నిలుస్తున్నది. ఓ మహిళపై సాటి మహిళే దుర్నీతికి పాల్పడిందనడానికి ఇవే ఆనవాళ్లు. ఇలాంటి ఘటనలు నిత్యం మన చుట్టే జరుగుతున్నా, ఆ ఘటనల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోవడమూ పొరపాట్లుగా భావించవచ్చు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన ఈ దారుణ ఘటనలో ఓ మహిళ లైంగికదాడులకు గురై, తీవ్రగాయాలపాలై పోలీసులను ఆశ్రయించింది. దీంతో దారుణ విషయం వెలుగులోకి వచ్చింది.
Rape Case: హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన రోజా ఇంటికి ఆమె స్నేహితురాలు (26) తన ఇంటికి తరచూ వచ్చేది. రోజాకు ఓ ప్రియుడు ఉన్నాడు. ఆ ప్రియుడి కన్ను ఆమె స్నేహితురాలిపై పడింది. ఈ విషయాన్ని తన ప్రియురాలికి చెప్పడంతో ముందూ, వెనుకా ఆలోచించకుండా ఒప్పేసుకున్నది. ఎలాగైనా లోబర్చుకోవాలని రోజా, ఆమె ప్రియుడు పన్నాగం పన్నారు.
Rape Case: ఈ దశలో రోజా, ఆమె ప్రియుడు కలిసి రోజా స్నేహితురాలైన ఆ అమాయకురాలిని ఆటబొమ్మగా మార్చేశారు. రోజూ ఇంటికి వచ్చే ఆ మహిళకు కూల్ డ్రింగ్‌లో, మరే రూపంలోనో మద్యం తాగించేవారు. ఆమె మత్తులోకి జారాక రోజా ప్రియుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఈ లైంగికదాడి సమయంలో రోజా వీడియోలు తీసేది. ఇలా ఆమెపై పైశాచికానికి పాల్పడ్డారు.
Rape Case: ఇలా నిందితుడైన ప్రమోద్ తన కోరికను తీర్చకునేవాడు. ఇలా కొన్నాళ్లు సాగుతుండగా, ఆట వస్తువే కదా అన్నుకున్నాడో? అడిగేవారే లేరనుకున్నాడో? చట్టమేమి చేస్తుందిలే అన్న చులకన భావమో? ఏమో కానీ ఆ అమాయకురాలిని మరో వ్యక్తికి బలి పశువును చేసేందుకు రోజా, ప్రమోద్ ఇద్దరూ పన్నాగం పన్నారు.
Rape Case: ఓ రోజు ఆ అమాయకురాలిని ఓ నిర్మానుశ్య ప్రాంతానికి తీసుకెళ్లారు రోజా, ప్రమోద్‌లిద్దరూ. ప్రమోద్ స్నేహితుడైన హరీశ్ లైంగిక వాంఛ తీర్చాలని యువతిని ఒత్తిడి చేశారు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో రోజా విపరీతంగా దాడి చేసి కొట్టింది. ఇద్దరూ కలిసి దారుణంగా ఆయువతిపై చర్మంపై దెబ్బలు తేలాలా కొట్టారు. ఎంతకొట్టినా ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను కొట్టి వదిలి వెళ్లిపోయారు. వారు చేసిన గాయాలతో నేరుగా పోలీసులను ఆశ్రయించింది ఆ బాధితురాలు. దీంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది.

