Ranveer Singh: బాలీవుడ్‌లో మరో సంచలనం రాబోతోంది! ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్, హిట్ డైరెక్టర్ అమిత్ రవీంద్రనాథ్ శర్మతో కలిసి ఓ అద్భుతమైన టైమ్ ట్రావెల్ చిత్రం కోసం చేతులు కలపనున్నారు. దినేష్ విజన్ నిర్మాణంలో రూపొందే ఈ సినిమా, భారతీయ పురాణాల ఆధారంగా ఓ యూనిక్ కథాంశంతో ప్రేక్షకులను అలరించనుంది. కాలాన్ని దాటి, చరిత్రను తడమనున్న ఈ చిత్రం, రణ్‌వీర్ డైనమిక్ పెర్ఫార్మెన్స్‌తో పాటు భారతీయ సంస్కృతిని ఆవిష్కరించే గ్రాండ్ విజువల్స్‌తో రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే కథ, తారాగణం, ఇతర వివరాలు బయటకు రానున్నాయి. ఈ సినిమా బాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని అంచనా.
