Dhurandhar OTT: రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. గత ఏడాది డిసెంబర్ 5న రిలీజై రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించింది. థియేటర్లలో ఇంకా మంచి రన్ కొనసాగుతున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఆ ముహూర్తం ఖరారైంది. నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని తాజా సమాచారం వెలువడింది.
Also Read: Mana Shankara Varaprasad Garu: సింగిల్ స్క్రీన్స్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ హవా!
‘ధురంధర్’ వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగే స్పై థ్రిల్లర్. రణ్‌వీర్ సింగ్ ‘రా’ ఏజెంట్ పాత్రలో అద్భుత నటనతో మెప్పించారు. అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, సంజయ్ దత్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. రూ.1300 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. 45 రోజులు గడిచినా థియేటర్లలో మంచి స్పందన కొనసాగుతోంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజా అప్‌డేట్ ప్రకారం జనవరి 30 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇంట్లో కూర్చుని ఈ భారీ యాక్షన్ విజువల్ వండర్‌ను ఆస్వాదించాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశమనే చెప్పాలి.
