Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కేవలం హీరో పాత్ర మాత్రమే కాదు హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకమట. అది కూడా మధ్య వయస్కురాలి పాత్రట. గొప్ప హీరోయిన్స్ మాత్రమే పోషించదగ్గ పాత్ర అని తెలుస్తున్నది.అయితే ఆ పాత్రకు బాలీవుడ్ సీనియర్ నటి అయితే బాగుంటుందట. అందుకే రాణీ ముఖర్జీ పేరును సూచించారట దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఆ ప్రపోజల్‌కి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. తన వయసుకు తగ్గట్టుగా, డిగ్నిఫైడ్‌గా ఉంటుందని చిరంజీవి భావించడం వల్ల ఆ పాత్ర రాణీ ముఖర్జీని వరించిందని ఫిల్మ్ వర్గాల టాక్. చిరంజీవి 158వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీపొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నది. త్వరలోనే నటీనటులను, సాంకేతిక నిపుణులను ఖరారు చేస్తారట.
