Ranbir Kapoor: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ సినిమాల్లోనే కాదు, వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు. రామాయణం చిత్రం రెండు భాగాలకు ఏకంగా 150 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం. ఒక్కో చిత్రానికి సుమారు 50 కోట్లు, బ్రాండ్ ఒప్పందాల ద్వారా ఏటా 6 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఓరియో, కోకా-కోలా, ఆసియన్ పెయింట్స్, రెనాల్ట్ వంటి బ్రాండ్‌లతో కలిసి పనిచేస్తూ, ఫ్యాషన్ బ్రాండ్ తస్వాకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.
Also Read: Odyssey: సంచలనం: విడుదలకు ముందే క్రిస్టోఫర్ నోలన్ ‘ఒడిస్సి’ రికార్డులు!
అంతేకాదు, ఎఫ్‌ఎంసీజీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ, సావ్న్, బెకో, డ్రోన్ ఆచార్య వంటి స్టార్టప్‌లలో భాగస్వామిగా ఉన్నాడు. క్రీడా రంగంలోనూ ముంబై సిటీ ఎఫ్‌సీలో వాటా కలిగి ఉన్నాడు. 345 కోట్ల ఆస్తులతో రణబీర్ వ్యాపార ఒడిదొడుకులు ఐదేళ్లలో 500 కోట్లు దాటే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణుల అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ హీరో తన యాక్టింగ్ తోనే కాక, సంపాదనతో కూడా మైండ్ బ్లాక్ చేస్తున్నాడు.

