Ramayana: బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న రామాయణం సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ రూపొందుతోంది. రాముడిగా రణ్‌బీర్, రావణుడిగా యష్ నటిస్తుండగా, ఈ సినిమా భారతీయ సినిమా సరిహద్దులను చెరిపేయనుంది. ఇప్పటికే ఈ చిత్రం బడ్జెట్, నిర్మాణ విలువలు చర్చనీయాంశంగా మారాయి. ఈ రామాయణం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందా? పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Mass Jathara: ‘మాస్ జాతర’ చిత్రం వాయిదా
రణ్‌బీర్ కపూర్ రామాయణం రూ.4000 కోట్ల బడ్జెట్‌తో భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలిచింది. దీపావళి 2026లో విడుదల కానున్న ఈ చిత్రం మొదటి భాగం రూ.900 కోట్లతో తెరకెక్కుతుంది. సాయి పల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ మినిమమ్ రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తేనే హిట్‌గా నిలుస్తుందని అంచనా. హాలీవుడ్ స్థాయి విజువల్స్, హన్స్ జిమ్మర్, రెహమాన్ సంగీతంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించనుంది.

